- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భారత్ మార్కెట్లోకి తొలి క్రూజర్ బైక్..!
దిశ, వెబ్‌డెస్క్: జర్మనీ దిగ్గజ కంపెనీ బీఎండబ్ల్యూ (BMW)మరో సూపర్ బైక్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. బీఎండబ్ల్యూ ఆర్18 (BMW R18) పేరుతో తెచ్చిన ఈ బైక్‌ను భారత (Indian)మార్కెట్లో విడుదల చేసింది. ఈ బైక్ ద్వారా క్రూజర్ సెగ్మెంట్ (cruiser segment)లోకి ప్రవేశించామని.. ఇది రెండు వేరియంట్లలో లభిస్తుందని కంపెనీ వెల్లడించింది. స్టాండర్డ్ వేరియంట్ (standard variant)ధర రూ. 18.9 లక్షలు (ఎక్‌షోరూమ్) ఉండగా, ఫస్ట్ ఎడిషన్ వేరియంట్ (First Edition variant) ధర రూ. 21.9 లక్షలు (ఎక్‌షోరూమ్)గా కంపెనీ నిర్ణయించింది. పూర్తి నిర్మాణ యూనిట్ (CBU) విభాగంలో ఈ బైక్ భారత్‌కు దిగుమతి అవుతోంది.
ఈ బైక్ బుకింగ్స్ (bookings) ఇప్పటికే ప్రారంభించినట్టు, బీఎండబ్ల్యూ మోటరాడ్ డీలర్ల ద్వారా బుకింగ్‌లను చేసుకునే వెసులుబాటు ఉందని బీఎండబ్ల్యూ ప్రతినిధులు ప్రకటించారు. బీఎండబ్ల్యూ ఆర్18 క్రూజర్ బైక్ (cruiser bike) 1802సీసీ కలిగి ఉంటుందని, 6 గేర్ స్పీడ్‌తో లభిస్తుందని కంపెనీ వెల్లడించింది. ఇంజన్ 4,750 ఆర్‌పీఎం (RPM)వద్ద 89.75 బీహెచ్‌పీ(BHP)ని, 3000 ఆర్‌పీఎం వద్ద 158 టార్క్‌ను జనరేట్ చేస్తుందని, ప్రత్యేకంగా రివర్స్ గేర్(Riverse gare) సదుపాయం కూడా ఉందని వివరించింది.
అంతేకాకుండా, స్విచబుల్ ఆటోమెటిక్ స్టెబిలిటీ కంట్రోల్ (Switchable automatic stability control), ఎల్ఈడీ లైటింగ్ సెటప్ (LED lighting setup), అనలాగ్ ఇన్స్ట్రుమెంటల్ కంట్రోల్ (Analog Instrumental Control)అదనపు ఆకర్షణగా ఉండనున్నట్టు పేర్కొంది. అలాగే, ముందు చక్రానికి డబుల్ డిస్క్ (Double disk)తో పాటు వెనక చక్రానికి సింగిల్ డిస్క్ (single disk) బ్రేకింగ్ వ్యవస్థ ఉంటుందని కంపెనీ వెల్లడించింది. కాగా, ఈ క్రూజర్ బైక్‌ను బీఎండబ్ల్యూ ఆర్5 స్పూర్తితో రూపొందించినట్టు తెలుస్తోంది. 1930ల్లో వచ్చిన ఆర్5 డిజైన్ స్టైల్‌లోనే కొత్త బైక్ కూడా డిజైన్ చేశారు.
ఈ సందర్భంగా బీఎండబ్ల్యూ గ్రూప్ ప్రెసిడెంట్ విక్రమ్ (vikram) మాట్లాడుతూ.. బీఎండబ్ల్యూ ఆర్18 ద్వారా క్రూజర్ విభాగంలోకి ప్రవేశించడం సంతోషంగా ఉందని, భారత మార్కెట్లో ఈ బైక్ కోసం చాలా మంది ఎదురుచూస్తున్నట్లు చెప్పారు.