- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
జగిత్యాలలో ‘బ్లఫ్ మాస్టర్’.. వడ్డీ వ్యాపారులకు దిమ్మతిరిగే షాక్
దిశ, జగిత్యాల: కోట్ల రూపాయలకు కుచ్చు టోపీ పెట్టి.. నమ్మిన వారిని నట్టేట ముంచి పారిపోయిన ఓ వ్యాపారి భాగోతం జగిత్యాల పట్టణంలో వెలుగుచూసింది. పట్టణంలోని పోచమ్మవాడకు చెందిన ఓ వ్యాపారి అందినకాడికి అప్పులు చేసి గత 5 రోజుల క్రితం ఇంటికి తాళం వేసి ఉడాయించాడు. తీరా వారి కుటుంబ సభ్యుల మొబైల్స్ సైతం ఆఫ్ కావడంతో మోసపోయామని అప్పులు ఇచ్చినవారు గ్రహించారు. అధికారికంగా రూ. 12 కోట్లు, అనధికారికంగా రూ. 25 కోట్ల వరకు ఉండవచ్చునని అంచనా. అధిక వడ్డీ వస్తుందని ఆశించిన కొందరు వడ్డీ వ్యాపారులు నిండా మునిగిపోయామని జగిత్యాల పోలీస్ స్టేషన్‌లో సదరు వ్యక్తిపై ఫిర్యాదు చేశారు.
సదరు వ్యక్తి పట్టణంలో సామాజిక సేవా కార్యక్రమాల పేరిట డబ్బులు విచ్చలవిడిగా ఇచ్చినట్టు తెలుస్తోంది. తనకు గ్రానైట్ వ్యాపారం, రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉన్నట్టు నమ్మించి అవసరానికి మించి అధిక వడ్డీలకు అప్పులు చేసి జల్సా చేసేవాడని చెప్పారు. తరచుగా కార్లు మారుస్తూ కొత్త మోడల్స్ కొంటూ రిచ్‌గా బిల్డప్ ఇవ్వడంతో.. నమ్మి అధిక వడ్డీలకు భారీ మొత్తంలో అప్పులు ఇచ్చినట్టు ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే ఒకే కుటుంబంలో ఒకరికి తెలియకుండా మరొకరు అప్పులు ఇవ్వడం గమనార్హం. ఎలాగైనా ఆ వ్యక్తిని పట్టుకుని చట్టపరమైన చర్యలతో పాటు.. న్యాయం చేయాలని వడ్డీ వ్యాపారులు వేడుకుంటున్నారు.