- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
వారి అభివృద్దే కేంద్రం లక్ష్యం
దిశ ప్రతినిధి, మేడ్చల్: రైతును రాజు చేయడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ గంగిరెడ్డి మనోహర్ రెడ్డి అన్నారు. దేశంలోనే తొలిసారిగా రైతుల రక్షణ, సంక్షేమం, అభివృద్ధికోసం రైతు చట్టాన్ని కేంద్రం తీసుకువచ్చిందని ఆయన తెలియజేశారు. కీసరలో మీడియా సమావేశంలో మంగళవారం ఆయన మాట్లాడుతూ.. భారత్‌ను విశ్వగురువుగా నిలపాలనీ, 130 కోట్ల భారతీయులకు ప్రగతి ఫలాలను అందించాలనే కేంద్రం అహర్నిశలు శ్రమిస్తోందన్నారు. 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలనే ఉద్దేశ్యంతో చారిత్ర్మక చట్టాలను పీఎం మోడీ తీసుకువచ్చారని వివరించారు. ఇప్పటి వరకు పంట పండిన తర్వాతనే అమ్మే అవకాశం ఉండేదని చెప్పారు. నూతన చట్టం ద్వారా పంట వేయకముందే అమోదయోగ్యమైన ధరకు ఒప్పందం కుదుర్చుకునే వీలుందన్నారు. పంట పండే కాలానికి ధర పడిపోయినా ముందు చేసుకున్న ఒప్పందానికి కొనుగోలు చేయాల్సి ఉంటుందని అన్నారు. ఒకవేళ ధర పెరిగితే మాత్రం ధరను పెంచి రైతు అమ్ముకోవచ్చునన్నారు. ఈ పధకాలు చూసి వోర్వలేకనే కాంగ్రెస్,సీపీఎం పార్టీలు రైతులను తప్పు తోవ పట్టిస్తున్నాయని ధ్వజమెత్తారు.