- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వీధికో బారు.. ఇంటింటికి బీరు.. ఇదే తెలంగాణ ప్రభుత్వం తీరు: బీజేపీ
దిశ, నాచారం: టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలకు అనుసరిస్తూ ధనార్జనే ధ్యేయంగా పాలన కొనసాగిస్తుందని బీజేపీ సీనియర్ నాయకులు కాప్రా మున్సిపాలిటీ కాంట్రాక్టర్ అసోసియేషన్ అధ్యక్షులు సంగిశెట్టి రవీంద్ర సాగర్ విమర్శించారు. ఈ సందర్భంగా విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం వాడవాడలా మద్యం దుకాణాలకు అనుమతిస్తూ ప్రభుత్వం తన ఆదాయ మార్గాలను పెంచుకుంటుంది తప్ప ప్రజల ఆరోగ్యంపై చిత్తశుద్ధి లేదన్నారు.
సామాన్య ప్రజలకు అందుబాటులో తాగునీటి సదుపాయం కల్పించకపోయినా వీధి వీధికి మద్యం దుకాణాలను అనుమతిస్తూ సామాన్య పేద ప్రజలకు మద్యాన్ని అందుబాటులో ఉంచుతుందని ఎద్దేవా చేశారు. సామాన్య పేద ప్రజల జీవితాలతో చెలగాటమాడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్యం దుకాణాలతో ధనార్జనే ధ్యేయంగా ప్రజారోగ్యాన్ని పణంగా పెట్టి ఆదాయాన్ని దండుకుంటున్నారని విమర్శించారు. పాఠశాలలు, బస్టాండ్ లా పక్కన మద్యం దుకాణాలు ఏర్పాటు చేస్తూ ప్రజలకు విద్యార్థులకు తీవ్ర అసౌకర్యాన్ని కలగజేస్తుంన్నారన్నారు.
ఇటీవల మల్లాపూర్ శివ హోటల్ చౌరస్తాలో మద్యం దుకాణాలకు అనుమతి ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ గురువారం నిరసన కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు తెలిపారు. ఉదయం 10 గంటలకు జరిగే ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ పాల్గొంటారని చెప్పారు. నిరసన కార్యక్రమం పార్టీలకతీతంగా ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని బీజేపీ నాయకులు రవీంద్ర సాగర్ పిలుపునిచ్చారు.