- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
టీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డికి బీజేపీ ఆఫర్
దిశ, తెలంగాణ బ్యూరో : టీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డికి బీజేపీ ఎంపీ అరవింద్ ఆఫర్ ఇచ్చారు. టీఆర్ఎస్ పార్టీనీ విడి బీజేపీలో చేరితే మంచిదని సూచించారు. ఆ పార్టీలో మంత్రులకే స్వేచ్ఛ లేదని, ఇక ఎంపీల పరిస్థితి అంతకంటే ఘోరమని, కనీసం కేసీఆర్ అపాయింట్‌మెంట్ కూడా దొరకదన్నారు. కోళ్ల ఫారాల కోసం మొక్కజొన్నను దిగుమతి చేసుకోవడానికి అవకాశం కల్పించాలంటూ కేంద్ర ప్రభుత్వానికి ఎంపీ రంజిత్ రెడ్డి విజ్ఞప్తి చేసిన తర్వాత అరవింద్ ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్రంలో మొక్కజొన్న నిల్వలు పేరుకుపోయాయని, అవసరానికంటే అదనంగా ఉన్నాయని స్వయంగా ముఖ్యమంత్రే వ్యాఖ్యానించారని, కానీ ఇప్పుడు అదే పార్టీకి చెందిన ఎంపీ మాత్రం విదేశాల నుంచి దిగుమతి చేసుకోడానికి అనుమతి ఇవ్వాలని కోరడం విడ్డూరంగా ఉందన్నారు. రాష్ట్రంలో నిజంగా మిగులు నిల్వలే ఉన్నట్లయితే కోళ్ల ఫారాల కోసం ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన అవసరం ఎందుకొచ్చిందని అరవింద్ ప్రశ్నించారు. నిల్వలు ఎక్కువగా ఉన్నందువల్లనే ఆ పంటను వేయవద్దంటూ రైతులకు కూడా రాష్ట్ర ప్రభుత్వం సూచనలు చేసిందని, ఇలాంటి పరిస్థితుల్లో కోళ్ల దాణా కోసం మొక్కజొన్నకు ఎందుకు కొరత ఏర్పడిందని ప్రశ్నించారు. ఈ పరిస్థితికి అనుగుణంగా ఇప్పటికైనా ఎంపీ రంజిత్ రెడ్డి ఆ పార్టీని వీడి బీజేపీలో చేరాలన్నారు.