స్టేజీపై రెజ్లర్ చెంప పగలగొట్టిన బీజేపీ ఎంపీ.. మండిపడుతున్న విపక్షాలు

by Shamantha N |
mp
X

రాంచీ: బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ సింగ్‌పై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. కారణమేంటి అనుకుంటున్నారా! జార్ఖండ్ రాజధాని రాంచీలో శనివారం అండర్-15 జాతీయ రెజ్లింగ్ చాంఫియన్ షిప్‌ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఓ వ్యక్తిపై చేయి చేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో క్షణాల్లో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా వీడియోలో ఎంపీ వద్దకు వచ్చిన ఓ యువ రెజ్లర్ ఏదో చెప్తున్నాడు. ఒక్కసారిగా ఎంపీ రెజ్లర్‌పై చేయి చేసుకోవడంతో పక్కకి వెళ్లిపోయాడు. ఇది చూసిన విపక్షాలు, నెటిజన్లు ఎంపీపై విమర్శల వర్షం కురిపించారు. ఎంపీ హోదాలో ఉండి సాధారణ పౌరులపై చేయి చేసుకోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి చర్యలతో దేశానికి బీజేపీ నేతలు ఏం సందేశం ఇస్తున్నారని కామెంట్లు చేస్తున్నారు. అయితే ఆ యువ రెజ్లర్ వయసు ఎక్కువైన కారణంగా అండర్-15 రెజ్లింగ్ పోటీల్లో తనకు చోటివ్వమని ఎంపీని ప్రాధేయపడినట్లు బీజేపీ నాయకులు తెలిపారు. దీనికి భూషణ్ సింగ్ నిరాకరించగా, పదే పదే కోరడంతో కోపం వచ్చి చేయి చేసుకున్నట్లు చెప్పారు. కాగా, భూషణ్ సింగ్ రెజ్లింగ్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియాకు అధ్యక్షుడిగా ఉన్నారు.

Advertisement

Next Story