బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో.. వ్యాట్ తగ్గించాలి ఉయ్యాలో..

by Shyam |   ( Updated:2021-12-02 02:03:24.0  )
బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో.. వ్యాట్ తగ్గించాలి ఉయ్యాలో..
X

దిశ, శేరిలింగంపల్లి: రాష్ట్ర ప్రభుత్వం ఇంధనంపై వెంటనే వ్యాట్ తగ్గించాలని బీజేపీ మహిళా మోర్చా నాయకులు డిమాండ్ చేశారు. ముంబై ప్రధాన రహదారిపై ద్విచక్ర వాహనాన్ని మధ్యలో పెట్టి బతుకమ్మ ఆడుతూ వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో.. వ్యాట్ తగ్గించాలి ఉయ్యాలో అంటూ పాటలు పాడుకున్నారు. ఈ సందర్భంగా మహిళా మోర్చా నాయకులు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ఇంధన ధరలను తగ్గించినా, రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ ను తగ్గించక పోవడంతో వాహనదారుల పై భారం పడుతోందని మండిపడ్డారు.

వచ్చే నెలజీతం పెట్రోల్ కోసమే వెచ్చిస్తే కుటుంబాలను ఎలా పోషించుకోవాలని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం మేడ్చల్ జిల్లా నాయకురాలు ఉప్పల విద్యాకల్పన, రాష్ట్ర మహిళా మోర్చా నాయకురాలు నాగ పరిమళ, లత, స్రవంతి, నాగలక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story