- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎన్‌సీపీలోకి భారీగా బీజేపీ నేతలు : అజిత్ పవార్
ముంబయి : ఎన్నికలకు ముందు బీజేపీలోకి చేరిన నేతలందరూ మరో మూడు లేదా నాలుగు నెలల్లో తిరిగి ఎన్‌సీపీలోకి చేరుతారని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం, ఎన్‌సీపీ నేత అజిత్ పవార్ శనివారం అన్నారు. ‘అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎన్‌సీపీ, కాంగ్రెస్‌ల నుంచి పెద్ద సంఖ్యలో నేతలు, కార్యకర్తలు బీజేపీలో చేరారు. బీజేపీ అధికారంలోకి వస్తే తమతమ ప్రాంతాలను అభివృద్ధి చేసుకునే ఉద్దేశంతో ఈ నిర్ణయాలు తీసుకున్నారు.
వారంతా ఇప్పుడు ఫ్రస్ట్రేషన్‌లో ఉన్నారని, ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేకపోతున్నారు. అందుకే వారంతా తిరిగి బీజేపీలోకి చేరాలని ప్రయత్నిస్తున్నారు’ అని తెలిపారు. పూణె నుంచి స్వస్థలం కొల్హాపూర్‌కు వెళతానని బీజేపీ మహారాష్ట్ర ప్రెసిడెంట్ చంద్రకాంత్ పాటిల్ చేసిన వ్యాఖ్యలపైనా స్పందించారు. ‘ఒకాయన తాను మళ్లీ అధికారంలోకి తిరిగి వస్తానని అన్నారు. మరొకరు కొల్హాపూర్‌కు తిరిగి వెళ్తారని పేర్కొన్నారు. ఒకరు(దేవేంద్ర ఫడ్నవీస్) మళ్లీ అధికారంలోకి రాలేదు కానీ, ఇంకొకరు ఇంటిదారి పట్టారు. పూణెలో తాను ఏం చేయలేరన్న విషయాన్ని ఏడాది కాలం తర్వాతగానీ అర్థం చేసుకోలేకపోయారు’ అని అజిత్ పవార్ అన్నారు.