- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గెలుపు అక్కడ.. సేవలు ఇక్కడ.. టీఆర్ఎస్ ఎమ్మెల్యే వింత కహానీ..?
దిశ, హుజురాబాద్ : హుజురాబాద్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. దీంతో అక్కడ ఉపఎన్నికలు అనివార్యమయ్యాయి. అయితే, నియోజకవర్గంలోని పలు గ్రామాలలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్‌తో శంకుస్థాపన చేయించడంపై బీజేపీ శ్రేణులు భగ్గమన్నారు. దీనిపై చర్యలు తీసుకోవాలని పంచాయతీ రాజ్ శాఖ అధికారులను కోరారు. అనంతరం ఆర్డీవో కార్యాలయంలో బీజేపీ నాయకులు ఫిర్యాదు చేశారు.
శనివారం హుజురాబాద్ మండలంలోని రంగాపూర్, రాంపూర్, రాజపల్లి, వెంకట్రావుపల్లి, పోతిరెడ్డి పేట గ్రామాలలో ఎంజీఎన్ఆర్ ఈజీఎస్ నిధులతో దళిత వాడలలో మంజూరైన సీసీ రోడ్లు, మురికి కాలువ నిర్మాణాలకు సంబంధించి నిబంధనలకు విరుద్ధంగా స్థానిక ఎంపీ బండి సంజయ్, రంగాపూర్ సర్పంచ్ కర్ణాకర్‌కు తెలియకుండా హుజురాబాద్ ఎమ్మెల్యే ఇలాఖాలో హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్‌తో శంకుస్థాపనలు చేయించడం ఎంటనీ పలువురు బీజేపీ నేతలు మండిపడ్డారు. అనంతరం పంచాయతీరాజ్ ఈఈ శ్రీనివాసరావు, డీఈ ప్రకాష్ రావులపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఆర్డీవో కార్యాలయంలోని డివిజనల్ పరిపాలన అధికారికి బీజేపీ నాయకులు వినతి పత్రం అందజేశారు.