బిగ్ బ్రేకింగ్.. మహిళతో బీజేపీ నేత రాసలీలలు.. వీడియో కాల్ లీక్ (వీడియో)

by Anukaran |   ( Updated:2021-08-25 00:05:07.0  )
kt ragavan video
X

దిశ, వెబ్‌డెస్క్ : బీజేపీ నేత వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. వీడియో కాల్‌లో ఒక మహిళ ముందు అర్ధన‌గ్నంగా నిల‌బ‌డిన వీడియో తమిళనాడులో సంచలనంగా మారింది. దీంతో సదరు బీజేపీ నేత తన పదవికి రాజీనామ చేశారు.

వివరాల ప్రకారం.. తమిళనాడు బీజేపీ ప్రధాన కార్యదర్శి కేటీ రాఘవన్ తన ఇంటిలో అర్ధనగ్నంగా కూర్చుని పార్టీ జిల్లా నాయకురాలితో అశ్లీలంగా మాట్లాడుతున్న వీడియో కాల్‌ మంగళవారం వైరల్ అయ్యింది. ఓ యూట్యూబ్‌ చానల్‌ నడుపుతున్న వ్యక్తి.. తనపేరు మదన్‌ అని.. బీజేపీ ప్రముఖుడినని పరిచయం చేసుకున్న సదరు వ్యక్తి ఆ వీడియోను విడుదల చేశాడు.

అందులో ఆయన మాట్లాడుతూ ‘‘గతంలోనూ బీజేపీ మహిళా నేతలతో ఆయన అసభ్య చేష్టలను రికార్డు చేశాను. బీజేపీకి చెందిన 15 మంది నేతలకు సంబంధించిన ఇలాంటి అసభ్యకర వీడియోలు, ఆధారాలు నా వద్ద ఉన్నాయి. కేటీ రాఘవన్‌ తనను తాను పెద్దమనిషిగా చాటుకుంటున్నందునే ఆయన వీడియోలు బయటపెట్టాను. అతడి వికృత చేష్టల వల్ల బాధితులైన ఎందరో గృహిణులు కుటుంబ సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ ఏడాది డిసెంబర్‌ చివరి నాటికి 60 వీడియోలు విడుదల చేస్తాను’’ అని వెల్లడించారు.

ఈ వీడియో బయటకు రావడంతో రాఘవన్‌పై కాంగ్రెస్ ఎంపీ జ్యోతిమణి రాష్ట్ర డీజీపీకి ఫిర్యాదు చేశారు. అతడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై విచారణ జరపాలని కోరారు.

ఇవి కూడా చదవండి:

బీజేపీ కౌన్సిలర్‌ను చెప్పుతో కొట్టిన మహిళ.. రోజూ అలా చేస్తున్నాడనే..!

స్టార్ హీరోయిన్ హాట్ కామెంట్స్.. అది తీసేసి నగ్నంగా ఉన్నానంటూ

Advertisement

Next Story