దీపం వెలిగించమంటే.. తుపాకీతో కాల్చింది

by Shamantha N |
దీపం వెలిగించమంటే.. తుపాకీతో కాల్చింది
X

కరోనా వైరస్ మహమ్మారి వ్యతిరేక పోరాటంలో భాగంగా భారత ప్రజల ఐకమత్యాన్ని తెలియజేయడానికి ఆదివారం రాత్రి 9 గంటలకు 9 నిమిషాలపాటు దీపాలు, క్యాండిళ్లు వెలిగించమని ప్రధాని మోదీ పిలుపు ఇచ్చారు. అందరిలా దీపాలు వెలిగిస్తే కిక్కు ఏముంటుంది అనుకున్నట్టున్నారు యూపీ బీజేపీ నేత. తుపాకీతో గాలిలోకి కాల్పులు జరిపారు. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న యూపీ పోలీసులు ఆమోపై కేసు నమోదు చేశారు.

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బలరామ్‌పూర్ బీజేపీ మహిళా విభాగం నేత మంజు తివారీ. ఆదివారం రాత్రి 9 గంటలకు అందరూ దీపాలు వెలిగిస్తుండగా తుపాకీతో ఆమె వీధుల్లోకి వచ్చారు. గాలిలోకి ఒక్క రౌండ్ కాల్పులు జరిపారు. ఏదో ఘనకార్యం సాధించినట్టు సమాజాన్ని తెలియజేసే ప్రయత్నం కూడా చేశారు. అందులో భాగంగా భర్తతో ఆ తంతగాన్ని వీడియో తీయించారు. సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అయింది. అన్ని వైపుల నుంచి విమర్శలు ఎదురుకావడంతో మంజు తివారీ బహిరంగంగా క్షమాపణలు చెప్పారు.

దీపా కాంతులతో నగరం మొత్తం వెలిగిపోతోంది. నాకు దీపావళి పండుగలా అనిపించింది. దీపోత్సవం ముగియగానే గాలిలోకి కాల్పులు జరిపాను. నా తప్పును అంగీకరిస్తున్నాను. ఇందుకు క్షమాపణ చెబుతున్నాను అని మంజు తివారీ తెలిపారు. ఈ సంఘటనపై కాంగ్రెస్ పార్టీ యూపీ శాఖ విమర్శలు ఎక్కిపెట్టింది. బీజేపీ నేతలు తరుచూ చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారని ఆరోపించారు.

Tags: BJP Leader Fires Shot At 9 pm Event, “Send Coronavirus Away”, go corona,

Advertisement

Next Story

Most Viewed