- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేసీఆర్ కనుసన్నల్లోనే దాడులు.. డీకే అరుణ ఆగ్రహం
దిశ, శంషాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ కనుసన్నల్లోనే రాష్ట్రంలో బీజేపీ నాయకులపై దాడులు జరుగుతున్నాయని మాజీ మంత్రి, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఆరోపించారు. బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీధర్ యాదవ్ ఆధ్వర్యంలో సోమవారం రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లోని శ్రీ వెండికొండ సిద్దేశ్వర ఆలయంలో జరిగిన లక్ష దీపోత్సవం కార్యక్రమంలో డీకే అరుణ పాల్గొని మాట్లాడారు. మహిళలకు గొప్ప పండుగ కార్తీక మాసమన్నారు. కార్తీక మాసంలో వెలిగే దీపాల మాదిరి ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నిండాలన్నారు. నల్లగొండ జిల్లాలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కాన్వాయ్‌పై జరిగిన దాడి మూర్ఖపు చర్య అన్నారు. టీఆర్ఎస్ గుండాల బెదిరింపులకు బయపడే పార్టీ బీజేపీ కాదని అన్నారు. రైతులను భయబ్రాంతులకు గురిచేస్తురన్నారు. రైతు పక్షాన ఉండి బీజేపీ న్యాయ పోరాటం చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు భాను ప్రకాష్, డాక్టర్ ప్రేమ్ రాజ్, మహేందర్, అంజన్ కుమార్ గౌడ్, ప్రశాంత్, కొమరయ్య, మల్లారెడ్డి, వెంకటయ్య, దేవేందర్, మహిపాల్ రెడ్డి, వంశీ, శ్రీనివాస్, చంద్రయ్య, మహేందర్ తదితరులు పాల్గొన్నారు.