కేసీఆర్ చెంప చెల్లుమనిపించారు: డీకే అరుణ

by Shyam |
DK Aruna
X

దిశ, వెబ్‌డెస్క్: దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రజలు సీఎం కేసీఆర్ చెంప చెల్లుమనిపించారని బీజేపీ నేత డీకే అరుణ వ్యాఖ్యానించారు. ఆదివారం కూకట్‌పల్లిలో బీజేపీ కార్యకర్తల సమావేశంలో ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కేసీఆర్‌కు ఓటమి తప్పదన్నారు. కేంద్రంపై యుద్ధం చేస్తానన్న కేసీఆర్ ఎందుకు నోరు మెదపడం లేదని, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ టీఆర్ఎస్‌కు గుణపాఠం చెప్పాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ ఎన్నికల ముందు కేసీఆర్ కొత్త నాటకం ఆడుతున్నారని, ఎలక్షన్స్ వస్తే కేసీఆర్ మాయమాటలు చెబుతారన్నారు. రాష్ట్రంలో అన్నివర్గాల ప్రజలను కేసీఆర్ మోసం చేశారని విమర్శించారు.

Advertisement

Next Story