దేవాలయాల అభివృద్ధే నా లక్ష్యం: సూర్యనారాయణ

by Shyam |
దేవాలయాల అభివృద్ధే నా లక్ష్యం: సూర్యనారాయణ
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: దేవాలయాల అభివృద్ధే నా లక్ష్యం అని బీజేపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ధన్‌పాల్‌ ‌సూర్యనారాయణ అన్నారు. అదివారం నగర శివారులోని బోర్గాంలోని, లక్ష్మి గణపతి ఆలయంలో శ్రీ‌ లక్ష్మీ సహస్ర చిత్రం ఆడియోను అవిష్కరించారు. ఈ సంధర్బంగా ఆయన మాట్లాడుతూ.. ప్రపంచ దేశాలు సనాతన హిందూత్వ ఆచార వ్యవహారాలను సంస్కృతి సంప్రదాయాలను గౌరవిస్తున్నారని తెలిపారు.

అరబ్‌ ‌దేశాలలో హిందూ దేవాలయాల నిర్మాణానికి స్థలాలు కేటాయించడం అంటే మన సంస్కృతికి ఎంతగా ఆకర్షితులవుతున్నారో అర్థమవుతోందన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాత రవిశ్రీ పారుపల్లి, సామాజిక సేవా కార్యకర్త మంచాల జ్ఞానేందర్‌, జిల్లా ఉపాధ్యక్షుడు నాగోళ్ళ లక్ష్మీ నారాయణ, కార్పొరేటర్లు రాజశేఖర్ రెడ్డి, మాస్టర్ శంకర్, బైకన్ మధు, ఇళ్లేందుల ప్రభాకర్, నగర ప్రధాన కార్యదర్శి నిచ్చేంగా కృష్ణ, మెట్టు విజయ్, కుమార్, భాస్కర్ రెడ్డి, భూపతి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story