- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భైంసాలో ఉద్రిక్తత.. పోలింగ్ బూత్ అధికారులపై ఆర్డీఓకు ఫిర్యాదు
by Aamani |
X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. కొన్నిచోట్ల ఉద్రిక్తంగా, మరికొన్ని చోట్ల ప్రశాంతంగా ఈ ఎన్నికల పోలింగ్ సరళి కొనసాగుతోంది. తాజాగా.. నిర్మల్ జిల్లా భైంసాలో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. భైంసా పోలింగ్ బూత్ అధికారులపై బీజేపీ కౌన్సిలర్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. తమ ఓటు ఎలా వేయాలని పోలింగ్ అధికారిని బీజేపీ కౌన్సిలర్లు అడగటంతో, అభ్యర్థి పక్కన టిక్ చేయాలని అధికారి సూచించారు. దీంతో కౌన్సిలర్లు అభ్యర్థి పక్కన టిక్ చేశారు. అయితే, అధికారి నిర్లక్ష్యం కారణంగానే తమ ఓటు రిజెక్ట్ అవుతోందని బీజేపీ కౌన్సిలర్లు ఆరోపిస్తున్నారు. ఈ విషయంలో బీజేపీ కౌన్సిలర్లు పోలింగ్ అధికారిపై భైంసా ఆర్డీఓకు ఫిర్యాదు చేశారు.
Advertisement
Next Story