బీజేపీ కార్యకర్త శ్రీనివాస్ మృతి

by Anukaran |   ( Updated:2020-11-05 11:50:27.0  )
బీజేపీ కార్యకర్త శ్రీనివాస్ మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: బీజేపీ కార్యాలయం వద్ద ఆత్మహత్యకు యత్నించిన గంగుల శ్రీనివాస్ మృతిచెందాడు. బండి సంజయ్‌ అరెస్ట్‌ను నిరసిస్తూ నవంబర్ 1న హైదరాబాద్ బీజేపీ ఆఫీస్ వద్ద పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్న శ్రీనివాస్.. 40శాతానికి పైగా కాలిన గాయాలతో ఆస్పత్రిలో చేరాడు. అప్పటి నుంచి సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీనివాస్ ఆరోగ్య పరిస్థితి విషమించి గురువారం రాత్రి చనిపోయాడు. శ్రీనివాస్‌ మృతితో స్వస్థలం రంగారెడ్డి జిల్లా యాచారం మండలం తుమ్మలోనిగూడంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. శ్రీనివాస్ మృతిపట్ల బండి సంజయ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Advertisement

Next Story