పుట్టిన రోజే చివరి రోజైంది

by Sridhar Babu |
పుట్టిన రోజే చివరి రోజైంది
X

దిశ, కరీంనగర్: పుట్టిన రోజే ఓ యువకుడికి చివరి రోజుగా మారింది. లాక్‌‌డౌన్‌లో మిత్రులతో కలిసి పార్టీ చేసుకోవడానికి వెళ్ళిన అతడు పోలీసులు వస్తున్నారనే భయంతో పరుగెత్తి బావిలో పడి మృతిచెందాడు. ఈ సంఘటన జమ్మికుంట పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన ఆడెపు రాజగోపాల్ ( 23) పుట్టినరోజు సందర్భంగా ఇల్లంతకుంట మండలం మల్యాల గ్రామంలో స్నేహితులతో కలిసి పార్టీ చేసుకునేందుకు తాటి చెట్ల వద్దకు వెళ్లాడు. కల్లు తాగుతుండగా పోలీసులు వస్తున్నారని సమాచారం ఇవ్వగా భయంతో పరుగెడుతూ బావిలో పడి మృతి చెందాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

tags: person died, falling in well, birthday, celebration with friends

Advertisement

Next Story