- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఘనంగా టీఎన్జీవో అధ్యక్షుడి జన్మదిన వేడుకలు
దిశ, నిజామాబాద్ సిటీ : తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు అలుక కిషన్ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. నిజామాబాద్ టీఎన్జీవో కార్యవర్గం ఆధ్వర్యంలో గురువారం ఈ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు అలుక కిషన్, ఆర్మూర్ ఏపీవో రాములు లు తమ పుట్టిన రోజును పురస్కరించుకుని కేక్ కట్ చేశారు. వారికి టీఎన్జీవో నేతలు పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణ ఉద్యమంలోనూ ఉద్యోగుల సమస్యల పరిష్కరంలోనూ ముందున్న ఉద్యోగ జేఏసీ చైర్మన్ అలుక కిషన్ మరిన్ని పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని ఉద్యోగ సంఘాల నేతలు ఆకాంక్షించారు. పలువురు నాయకులు, ఉద్యోగస్తులు, వివిధ సంఘాల నేతలు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీవోస్ జిల్లా కార్యదర్శి అమృత్ కుమార్, ఆర్మూర్ డివిజన్ అధ్యక్షులు వెంకట్ రెడ్డి, కామారెడ్డి మాజీ అధ్యక్షులు దయానంద్, మాజీ ఎమ్మార్వో మోహన్, స్వామిదాస్, దేవిదాస్, పోల శ్రీనివాస్ తదితరులున్నారు.