- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘ప్రపంచ ఆటో విడిభాగాల సరఫరాలో భారత్ కీలక పాత్ర’
దిశ, వెబ్‌డెస్క్: కరోనా మహమ్మారి నేపథ్యంలో అంతర్జాతీయ సరఫరా వ్యవస్థలో చైనాకు ప్రత్యామ్నాయాన్ని సంస్థలు కోరుకుంటున్నాయి. ఈ క్రమంలోనే భారత్‌లో అభివృద్ధి చెందుతున్న అవకాశాలను మరిన సామర్థ్యంతో నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రముఖ ఆటో కాంపొనెంట్ సంస్థ బిర్లా ప్రెసిషన్ టెక్నాలజీస్ లిమిటెడ్ తెలిపింది. దీనికోసం వచ్చే ఏడాది కాలానికి రూ. 30 కోట్ల పెట్టుబడులు పెట్టాలని కంపెనీ భావిస్తోంది. ఈ పెట్టుబడులను తయారీ సామర్థ్యాన్ని పెంచేందుకు వినియోగించనున్నట్టు బిర్లా ప్రెసిషన్ టెక్నాలజీస్ ఛైర్మన్, ఎండీ వేదాంత్ బిర్లా చెప్పారు. ‘అంతర్జాతీయ ఆటోమోటివ్ సరఫరా విభాగంలో భారత్ కీలక పాత్ర వహించనుంది. రానున్న రోజుల్లో కంపెనీలు తమ కార్యకలాపాలను భారత్‌కు మార్చాలని ఆశిస్తున్నాయి. ప్రపంచం కరోనా నుంచి బయటపడిన వెంటనే ఈ ప్రక్రియ వేగవంత అయ్యే అవకాశాలున్నాయని’ వేదాంత్ బిర్లా వెల్లడించారు.