తెలుగు రాష్ట్రాల్లో వందలాది నాటుకోళ్లు మృతి

by srinivas |
తెలుగు రాష్ట్రాల్లో వందలాది నాటుకోళ్లు మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో నాటుకోళ్లు మృత్యువాత పడుతున్నాయి. ఖమ్మం, చిత్తూరు, కర్నూలు, పెద్దపల్లి, వరంగల్ జిల్లాల్లో వందల సంఖ్యలో నాటుకోళ్లు మృతి చెందాయి. బర్డ్ ప్లూ వ్యాప్తి నేపథ్యంలో కోళ్ల పెంపకందారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కోళ్లు మరణించిన తర్వాత ముక్కులోంచి ఒక రకమైన ద్రవం కారడం, కొన్ని కోళ్లకు చర్మంపై బోడిపెలుగా వచ్చి చర్మం రాలిపోవడం వంటివి జరుగుతున్నాయని బాధితులు చెబుతున్నారు. మృతి చెందిన కోళ్ల శాంపిల్స్‌ను పశుసంవర్ధక శాఖ అధికారులు ల్యాబ్‌కు పంపారు.

Advertisement

Next Story