14 ఏళ్లుగా పాజిటివ్.. ఇప్పుడు ఫ్రీ అయ్యాడట!

by Shyam |
14 ఏళ్లుగా పాజిటివ్.. ఇప్పుడు ఫ్రీ అయ్యాడట!
X

దిశ, సినిమా : యాక్టర్ బిల్లీ పోర్టర్ సైలెన్స్ బ్రేక్ చేశాడు. పోజ్ సిరీస్‌లో హెచ్‌ఐవీ ఉన్న వ్యక్తి (ప్రే టెల్ పాత్ర)గా నటించి ఎమ్మీ అవార్డు అందుకున్న ఆయన.. తన నిజజీవితంలోనూ అదే జరిగిందని తెలిపాడు. 14 ఏళ్లుగా హెచ్‌ఐవీ పాజిటివ్‌తో బాధపడుతున్నానని, ఇప్పుడు ఫ్రీ అయ్యానని ఓపెన్ అయ్యాడు. నిజం అనేది వైద్యం లాంటిది.. అది మనసును బాధ నుంచి విముక్తి చేస్తుందని నమ్ముతున్నానని అన్నాడు. తద్వారా శాంతిని, సాన్నిహిత్యాన్ని పొందగలనని.. సిగ్గు లేకుండా సెక్స్ కూడా చేయగలనని చెప్పాడు.

2007లో టైప్ 2 డయాబెటీస్‌తో బాధపడుతున్న క్రమంలోనే హెచ్‌ఐవీ పాజిటివ్ సంక్రమించిందన్న బిల్లీ.. ఈ విషయం తెలిసి సిగ్గుతో మౌనంగా ఉండిపోయానని, ఇన్నాళ్లు అలాగే జీవించానని చెప్పాడు. పెంటకోస్టల్ చర్చిలో పెరిగిన వ్యక్తిగా ఈ విషయాన్ని బయటపెట్టేందుకు సిగ్గుపడ్డానని, తల్లి బాధపడుతుందేమోనని భయపడ్డానని అన్నాడు. తప్పుడు వ్యక్తులకు ఈ సమాచారం తెలిస్తే కెరియర్ ఏమైపోతుందోనని ఆందోళన చెందానని చెప్పాడు.

Advertisement

Next Story