- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
సెక్సువల్ మిస్‌బిహేవియర్ ఎదుర్కొన్న సింగర్..
దిశ, సినిమా : యూఎస్ సింగర్ బిల్లీ ఐలిష్ సెక్సువల్ మిస్ బిహేవియర్ గురించి ఓపెన్ అయింది. వోగ్ మ్యాగజైన్‌పై దర్శనమిచ్చిన ఈ 19ఏళ్ల సింగర్.. తన వయసు అమ్మాయిలందరూ ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపింది. తాను మ్యూజిక్ ఇండస్ట్రీలో ఉన్నాను కాబట్టి ఇలా జరిగి ఉండొచ్చని అనుకోవచ్చు గానీ.. లైంగిక వేధింపులు అనేవి ప్రతీచోట ఉన్నాయని వివరించింది. తనతో పాటు తన చుట్టూ ఉన్న ప్రతీఒక్క మహిళ ఇలాంటి బ్యా్డ్ ఎక్స్‌పీరియన్స్ కలిగి ఉందంటే అతిశయోక్తి కాదని చెప్పింది ఐలిష్.
అంతేకాదు.. మీరు ఎవరు? మీ జీవితం ఏమిటి? మీ పరిస్థితులు ఏంటి? మీరు ఎంత బలంగా ఉన్నారు? ఎంత తెలివైనవారు? అనే విషయాలతో సంబంధం లేకుండా.. పురుషులు అడ్వాంటేజ్ తీసుకుని ప్రయోజనాలు పొందుతారని అభిప్రాయపడింది. గృహ హింస, అత్యాచారంతో నిండిపోయిన ఈ ప్రపంచంలో ఇదొక పెద్ద సమస్య అన్న ఐలిష్.. తెలివైన వారు మాత్రమే ‘ఓ మై గాడ్, నేను ఇక్కడ బాధితురాలిని’ అని రియలైజ్ అవుతారని చెప్పింది. ఆ ఆలోచన అవమానంగా, నిరుత్సాహంగా ఉండొచ్చు కానీ.. బాధితురాలిని అని తెలుసుకొని జాగ్రత్తపడడమే ముఖ్యమని తెలిపింది.
ఇక బాడీ పాజిటివిటీ గురించి మాట్లాడిన సింగర్.. మీ బాడీని చూపించడం, మీ స్కిన్‌ను ప్రదర్శించడం ద్వారా రెస్పెక్ట్ తగ్గుతుందనే ఆలోచన మానేయాలని సూచించింది. ఎక్స్‌పోజింగ్ ద్వారా మీరు హ్యాపీగా ఉన్నారా? అనేది మ్యాటర్ అని చెప్పింది. మీరు సర్జరీ చేయించుకోవాలి అనుకుంటే చేయించుకోండి.. మీరు బిగ్ క్లాత్స్ వేసుకోవాలనుకుంటే వేసుకోండి.. అంతేకానీ చూసిన వారు ఏమనుకుంటారు? ఎలా కామెంట్ చేస్తారు? అనే విషయాన్ని పూర్తిగా మరిచిపోవాలని సూచించింది. మీకు మీరు మంచిగా కనిపిస్తున్నారా లేదా? శాటిస్‌ఫై అయ్యారా? లేదా? అన్నదే ఫైనల్ అని.. మీరు సంతృప్తిగా ఉండటమే కావాల్సిందని తెలిపింది.