వారి సినిమా బీహార్‌లో నిషేధమా?

by Shyam |
వారి సినిమా బీహార్‌లో నిషేధమా?
X

బాలీవుడ్ నటుడు సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ మరణం.. బాలీవుడ్‌లోని చీకటి కోణాన్ని మరోసారి ప్రపంచం ముందుంచింది. నెపోటిజంతో ప్రతిభగల నటులకు అవకాశాలు దక్కకుండా అణగదొక్కుతారన్న విషయం మరోసారి స్పష్టమైంది. ఈ నేపథ్యంలోనే బాలీవుడ్‌లో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. బాలీవుడ్‌లోని కొందరు పెద్దలు సుశాంత్ కెరీర్‌ను నాశనం చేయడం వల్లే అతడు ఆత్మహత్య చేసుకున్నాడని కొందరంటుంటే, మరికొందరేమో లవ్ ఫెయిల్యూర్ వల్లే ఇలా చేశాడంటున్నారు. ఏదేమైనా సుశాంత్ మరణాన్ని బిహారీలు తట్టుకోలేకపోతున్నారు. దీనికి కారణమైన వారి సినిమాలను బీహార్‌లో బ్యాన్ చేయాలని వారు నిర్ణయించుకున్నారని తెలుస్తోంది.

సుశాంత్‌సింగ్‌ మరణానికి బాలీవుడ్ ప్ర‌ముఖులు కరణ్ జోహార్, సల్మాన్ ఖాన్, అలియా భట్, సంజయ్ లీలా భన్సాలీ, ఏక్తా కపూర్‌లు కారణమని ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికే బిహారీలు వీరి దిష్టిబొమ్మలు సైతం దగ్ధం చేశారు. తాజాగా పాట్నావాసులు ఈ బాలీవుడ్ ప్ర‌ముఖుల చిత్రాల‌ను తమ రాష్ట్రంలో నిషేధించే దిశ‌గా ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే బీహార్‌లోని ప్రముఖ న్యాయవాది సుధీర్ కుమార్ ఓఝా.. 8 మంది బాలీవుడ్ ప్రముఖులు సుశాంత్ సింగ్‌ను ఆత్మహత్యకు పురికొల్పారని న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

సుశాంత్‌ చివరిసారిగా చిచ్చోరే చిత్రంలో కనిపించాడు. ఆ సినిమా మంచి విజయం సాధించడంతో పాటు సుశాంత్ నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఈ సినిమా బ్లాక్ బస్టర్ తర్వాత సుశాంత్ 7 సినిమాలకు ఒప్పుకున్నాడని, కానీ ఆ ఆఫర్లన్నింటినీ దూరం చేశారని, బాలీవుడ్ నిర్మాతలంతా సిండికేట్‌గా మారారని ఆరోపణలు వచ్చాయి. కంగనా, శేఖర్ కపూర్‌లతో పాటు పలువురు బాలీవుడ్ ప్రముఖులు కూడా ఇలాంటి సంచలన వ్యాఖ్యలు చేశారు. సుశాంత్‌ను ఎదగకుండా ఆపాలనే 7 సినిమాల్లో తప్పించారని రాజకీయ నాయకుడు సంజయ్ నిరుపమ్ సంచలన ట్వీట్ చేయడం గమనార్హం.

Advertisement

Next Story