Bigg Boss Telugu 8: ఈ హౌస్ లో నువ్వైనా ఉండాలి లేదా నేనైనా ఉండాలంటూ అతని మీద రెచ్చిపోయిన యష్మి

by Prasanna |   ( Updated:2024-09-24 07:40:12.0  )
Bigg Boss Telugu 8: ఈ  హౌస్ లో నువ్వైనా ఉండాలి లేదా నేనైనా ఉండాలంటూ అతని మీద రెచ్చిపోయిన యష్మి
X

దిశ, వెబ్ డెస్క్ : బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 రసవత్తరంగా సాగుతుంది. మూడు వారాలు సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకొని నాలుగో వారంలోకి అడుగుపెట్టింది. ఇప్పటికి ముగ్గురు కంటెస్టెంట్స్ ఇంటి నుంచి బయటకు వెళ్ళారు. వారంలో సోమవారం నాడు నామినేషన్స్ ప్రక్రియ సాగుతుందనే విషయం తెలిసిందే కదా..

ఈ నామినేషన్స్ లో కంటెస్టెంట్స్ ఒకరి మీద ఒకరు విరుచుకుపడతారు. ఆ వారంలో జరిగిన వాటిని గుర్తు చేసి మరీ నామినేట్ చేస్తారన్న విషయం తెలిసిందే. ఇక నాలుగో వారం అయితే మరి చిన్న పిల్లలు కొట్టుకున్నట్టు అరుచుకుంటూ నామినేషన్స్ చేసారు. గత వారం హాగ్ విషయంలో షాకింగ్ నిర్ణయం తీసుకున్న యష్మి కావాలని నాగ మణికంఠని నామినేట్ చేసింది. అయితే, ఈ వారం ఆ మాటని గుర్తు పెట్టుకుని కాసుకో .. ఈ బిగ్ బాస్ హౌస్ లో నువ్వైనా ఉండాలి లేదా నేనైనా ఉండాలి అంటూ అమ్మోరులా ఫైర్ అయి యష్మి మళ్ళీ నాగ మణికంఠని నామినేట్ చేసింది. ఫైనల్ గా పృథ్వి, నాగమణికంఠ, ఆదిత్య, ప్రేరణ, సోనియా, నబీల్‌, నైనికలు నామినేషన్స్ లో నిలిచారు.

ఇది చూస్తున్న ప్రేక్షకులు.. ఇంట్లో అసలు ఏమి జరుగుతుందో ఏమి అర్ధం కావడం లేదు.. చూసే మాకే ఇలా ఉంటే.. ఆడుతున్న మీకు ఏమైనా అర్ధమవుతుందా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed