- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Gangavva: బిగ్‌బాస్ హౌస్‌లో గంగవ్వ జోరు.. మొదటిరోజే మణికంఠకు క్లాస్ పీకిందిగా!!
దిశ, వెబ్‌డెస్క్: తెలుగు ప్రేక్షకుల ఫేవరెట్.. బుల్లితెర రియాలిటీ షో బిగ్‌బాస్ సీజన్-8 అట్టహాసంగా సాగుతోంది. ఇక ఎప్పటినుంచో బిగ్ బాస్ లవర్స్ అండ్ హౌస్‌మేట్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తోన్న వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఆదివారం గ్రాండ్‌గా ఇచ్చారు. హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన 14 మందిలో ఏడుగురు ఎలిమినేట్ అయ్యారు. తాజాగా హౌస్‌లో ఉన్న విష్ణుప్రియ, యష్మీ, పృథ్వీ, సీత, ప్రేరణ,నబీల్, ప్రేరణ, మణికంఠలకు ఏకంగా ఎనిమిది మంది కంటెస్టెంట్లు పోటీగా రంగంలోకి దిగారు. మరీ వారు ఎవరెవరంటే.. బిగ్ బాస్ మొదటి సీజన్‌లో పాల్గొన్న టాలీవుడ్ నటి హరితేజ అండ్ యూట్యూబర్ టేస్టీ తేజ, నయని పావని, యూట్యూబర్ మెహబూబ్, జబర్దస్త్ లేడీ కమెడియన్ రోహిణి, గౌతమ్ కృష్ణ, ముక్కు అవినాష్, గంగవ్వ .. మొత్తం ఎనిమిది మంది హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇక ఇవాళ నుంచి బిగ్‌బాస్ హౌస్‌లో రచ్చ రచ్చే అంటూ ఫ్యాన్స్ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.
అయితే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా హౌస్‌లోకి వెళ్లిన వారు పరిచయాలు పెంచుకుంటోన్న సమయంలో గంగవ్వ.. మణికంఠపై కామెంట్లు చేసింది. ‘నా పెళ్లాం, పిల్ల యాదికొస్తుందనేవాడి ఎందుకొచ్చినవ్ మరీ నామినేషన్ వేస్తా వెళ్లు మరీ అని అంటుంది. దీనికి మణికంఠ ఎంత ముద్దుగా అడిగావో నువ్వు అనుకుంటూ గంగవ్వ పక్కన వచ్చి కూర్చుంటాడు. ఈ వారం ఏడవను అని మణికంఠ అనగా.. మరీ ఇంకో వారం పోతవా అని గంగవ్వ పంచ్ వేస్తుంది. దీంతో హౌస్‌లో నవ్వులు పూస్తాయి. ప్రస్తుతం మణికంఠ-గంగవ్వ సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.