Bigg Boss: నాగార్జున ముందే పొట్టు పొట్టు కొట్టుకున్న ప్రేరణ, యష్మీ.. షాక్‌కి గురైన తోటి కంటెస్టెంట్స్(వీడియో)

by Kavitha |   ( Updated:2024-09-30 03:33:31.0  )
Bigg Boss: నాగార్జున ముందే పొట్టు పొట్టు కొట్టుకున్న ప్రేరణ, యష్మీ.. షాక్‌కి గురైన తోటి కంటెస్టెంట్స్(వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: బిగ్‌బాస్ సీజన్ 8 ఎంతో రసవత్తరంగా సాగుతోంది. నాలుగు వారాలు సక్సెస్ ఫుల్‌గా పూర్తి చేసుకుని ఇప్పుడు ఐదోవారంలోకి అడుగుపెట్టింది. ఇక హౌస్‌మేట్స్ కూడా ఎవరికి ఎవరూ తక్కువ కాదు అన్నట్లుగా గేమ్స్‌లో తమ సత్తా చూపిస్తున్నారు. అయితే ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్‌లో లేడీ టైగెర్స్‌గా పిలవబడిన కంటెస్టెంట్స్ ప్రేరణ, యష్మీ. స్టార్ మా ఛానల్‌లో ప్రసారమయ్యే 'కృష్ణ ముకుంద మురారి' సీరియల్‌లో ప్రేరణ హీరోయిన్‌గా నటించగా.. యష్మీ విలన్‌గా నటించింది. కానీ, హౌస్‌లోకి అడుగుపెట్టినప్పటి నుండి వీళ్లిద్దరు ఎంతో స్నేహంగా ఉంటూ రావడం అందరూ గమనించారు.

ఇదిలా ఉండగా.. నిన్నటి ఎపిసోడ్‌కి సంబంధించిన ప్రోమోలో వీళ్లిద్దరు పోటీ పడి ఆడడం హైలైట్‌గా నిల్చింది. ఈ ప్రోమోలో నాగార్జున ‘ట్యూన్ పట్టు..గెస్ కొట్టు’ అనే గేమ్ కంటెస్టెంట్స్‌తో ఆడుతాడు. ఇరు టీమ్ సభ్యులకు సంబంధించి చెరో ఒకరు ఈ గేమ్‌లో ఆడాల్సి ఉంటుంది. ఎదురుగా ఒక బోర్డు ఉంటుంది. క్రింద హీరో, హీరోయిన్లకు సంబంధించిన ఫొటోలు ఉంటాయి. పాట రాగానే ఆ పాటలో నటించిన హీరో హీరోయిన్ల ఫొటోలను బోర్డుకు తగిలించాలి. ముందుగా హలో బ్రదర్ నుండి ‘ప్రియరాగాలే’ సాంగ్‌ని వేస్తాడు బిగ్ బాస్. కాంతారా టీం నుండి విష్ణు ప్రియా, శక్తి టీం నుండి పృథ్వీ వస్తారు. ఈ రౌండ్‌లో విష్ణు ప్రియా నాగార్జున, సౌందర్య ఫోటోలను బోర్డుకు తగిలించి పాయింట్లు కొట్టేస్తుంది. ఇక ఆ తర్వాత ‘ఘర్షణ’ చిత్రం నుండి ‘చెలియ..చెలియా’ సాంగ్ వస్తుంది. ఈ రౌండ్‌కు కాంతారా టీం నుండి ప్రేరణ, శక్తి టీం నుండి యష్మీ వస్తారు. యష్మీ చేతిలో వెంకటేష్ బొమ్మ ఉంటుంది, అలాగే ప్రేరణ చేతిలో హీరోయిన్ ఆసిన్ బొమ్మ ఉంటుంది.

ప్రేరణ యష్మీతో మాట్లాడుతూ ‘ఇది ఏ సినిమాలోని సాంగ్ చెప్పురా చూద్దాం’ అంటుంది. అప్పుడు యష్మీ ‘నువ్వు చెప్పు చూద్దాం’ అంటుంది. అప్పుడు ప్రేరణ ‘చెలియ..చెలియా’ పాట పాడుతుంది. అప్పుడు యష్మీ ప్రేరణని వెక్కిరిస్తున్న సమయంలో ప్రేరణ యష్మీ నుండి వెంకటేష్ బొమ్మని కొట్టేస్తుంది. అప్పుడు ఇద్దరి మధ్య తోపులాట జరుగుతుంది. బోర్డు కూడా ఊగిపోతాది. ఇదంతా చూసి హౌస్ మేట్స్ ‘వామ్మో’ అని అనుకుంటారు. ఇదంతా సరదాగానే సాగిపోతుంది. కాగా ఈ రౌండ్‌లో కాంతారా టీం గెలుస్తుంది. ఈ ప్రోమో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.

(video link credits to Disney+Hotstar Telugu YouTube channel)

Advertisement

Next Story