BIGG BOSS-7: మూడు వారాలకు దామిని తీసుకున్న రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?

by Hamsa |   ( Updated:2023-09-25 10:00:13.0  )
BIGG BOSS-7: మూడు వారాలకు దామిని తీసుకున్న రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
X

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు బుల్లితెర షో బిగ్‌బాస్ షో దూసుకుపోతుంది. ప్రస్తుతం సీజన్-7 ప్రసారమవుతుంది. వారం వారం ఊహించని ఎలిమినేషన్స్‌తో షోపై ఆసక్తి పెరిగేలా చేస్తున్నారు. అయితే మూడోవారం సింగర్ దామిని ఎలిమినేట్ అయింది. హౌస్ లో ఆమె దాదాపు మూడు వారాలు ఉంది. దీనిపై ఆమె మాట్లాడుతూ నేను ఇంకా మరికొన్ని రోజులు ఉంటానేమో అనుకున్నాను. కానీ మూడు వారాలకే వెళ్ళిపోతున్న అంటూ ఆవేదన వ్యక్తం చేసింది.

తాజాగా, దామిని రెమ్మునరేషన్‌పై సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. తాజా సమాచారం ప్రకారం.. ఆమె వారానికి 2 లక్షలు.. అంటే మూడు వారాలకు 6 లక్షల రెమ్యునరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా, దామిని బాహుబలి సినిమా పాటలతో సింగర్‌గా ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది. ఆమె ఒక్క పాటకు లక్ష వరకు తీసుకుందట. ఈ లెక్కన బిగ్‌బాస్‌కు రావడం వల్ల బాగానే నష్టం వచ్చినట్లు తెలుస్తోంది.

Advertisement

Next Story