బిగ్ బాస్‌: అమ్మాయి స్నానం చేస్తుండగా ఆ పని చేసిన కంటెస్టెంట్.. షాక్‌లో హౌస్ మేట్స్

by Shyam |   ( Updated:2023-03-30 17:21:10.0  )
బిగ్ బాస్‌: అమ్మాయి స్నానం చేస్తుండగా ఆ పని చేసిన కంటెస్టెంట్.. షాక్‌లో హౌస్ మేట్స్
X

దిశ, సినిమా : హిందీ బిగ్ బాస్ సీజన్ 15 ఫైర్ ఆన్ ఫైర్ టైప్‌లో సాగుతోంది. ఈ క్రమంలోనే హౌజ్‌లో పెద్ద డ్రామానే నడిచింది. లేటెస్ట్ ప్రోమోలో విద్యా పాండ్య స్నానం చేస్తుండగా ప్రతీక్ సెహజ్‌పాల్ వాష్ రూమ్ డోర్ లాక్ బ్రేక్ చేశాడు. ఆ తర్వాత బయటకు వచ్చిన విద్యా.. మిగిలిన కంటెస్టెంట్స్‌కు ఈ విషయంపై కంప్లయింట్ చేసింది. దీంతో అందరూ అలా ఎలా చేస్తావని ప్రతీక్‌ను ప్రశ్నిస్తే.. గేమ్‌లో భాగంగానే తను అలా చేశానని వివరణ ఇస్తాడు. బాత్రూమ్‌లో ఎవరున్నారు అనే విషయం గురించి ఆలోచించలేదని, తను గేమ్ ఆడేందుకు బిగ్ బాస్‌కు వచ్చాను కాబట్టి అదే చేశానని చెప్పాడు. ఈ సమాధానానికి కోపంతో ఊగిపోయిన కరణ్ కుంద్రా ఇలాంటి ఇన్సిడెంట్ మరో అమ్మాయి దగ్గర రిపీట్ అయితే బాగోదని వార్నింగ్ ఇచ్చాడు. ఇక మరో ప్రోమోలో మాయిషా అయ్యర్, లెషాన్ షెగాల్ మధ్య క్లోజ్‌నెస్ పెరగడంపై మిగిలిన కంటెస్టెంట్స్‌ ఆటపట్టించారు.

Advertisement

Next Story