‘వరల్డ్ ఫేమస్ లవర్’ డిస్ట్రిబ్యూటర్లకు నష్టం

by Shyam |
‘వరల్డ్ ఫేమస్ లవర్’ డిస్ట్రిబ్యూటర్లకు నష్టం
X

పెళ్లిచూపులు సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న హీరో విజయ్ దేవరకొండ గ్రాఫ్ అర్జున్‌రెడ్డి సినిమాతో అమాంతం పెరిగిపోయింది. తర్వాత వచ్చిన టాక్సీవాలా, గీతాగోవిందం చిత్రాలు హిట్ అయినా, డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రాలు డిజాస్టర్‌గా నిలిచాయి. ముఖ్యంగా వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాకు చాలా నెగెటివ్ టాక్ వచ్చింది. విజయ్ అర్జున్‌రెడ్డి నుంచి బయటకు రాలేకపోతున్నాడని, ఇలా చేస్తే సినిమా కెరియర్ కష్టమే అని విమర్శించారు. విజయ్, డైరెక్టర్ క్రాంతి మాధవ్ మధ్య విబేధాలే సినిమా పరాజయానికి కారణమనే వార్తలు వినిపించాయి. సినిమాకు హ్యాపీ ఎండింగ్ ఇవ్వమని విజయ్ కోరితే, దర్శకుడు ఒప్పుకోలేదని కూడా సమాచారం. అంతేకాదు ఇదే నా చివరి ప్రేమకథ అని చెప్పడం… విజయ్ సినిమాను నమ్మకపోవడం అన్నీ నెగెటివ్ అయ్యాయని అనుకుంటున్నారట. మొత్తానికి సినిమా మాత్రం ఫ్లాప్2టాక్ తెచ్చుకుని, రెండో రోజు వసూళ్లను కూడా అందుకోలేకపోయింది అంటున్నారు సినీ విశ్లేషకులు.

వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా థ్రియాట్రికల్ రైట్స్ రూ.23 కోట్లకు అమ్ముడు పోగా, కేవలం రూ.9 కోట్ల కలెక్షనే వచ్చిందట. దీంతో డిస్ట్రిబ్యూటర్లు తమకు న్యాయం చేయాలంటూ ఫిల్మ్ చాంబర్‌లో సంప్రదించగా పరిహారం చెల్లించేందుకు ఓకే చెప్పారట నిర్మాత కేఎస్ రామారావు. విజయ్ సినిమాకు రూ.10 కోట్ల రెమ్యునరేషన్ తీసుకోగా… అందులో కొంత తిరిగి ఇస్తే డిస్ట్రిబ్యూటర్లకు చెల్లిస్తామని హామీ ఇచ్చారట.

Advertisement

Next Story