- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భూమి సరికొత్త దివాళీ కానుక..
దిశ, వెబ్‌డెస్క్ : బాలీవుడ్ భామ భూమి పెడ్నేకర్ క్లైమేట్ వారియర్‌గా పనిచేస్తున్న విషయం తెలిసిందే. ఈ మేరకు పర్యావరణం, ప్రకృతి ప్రాధాన్యత గురించి ప్రపంచవ్యాప్తంగా అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తోంది. కాగా ప్రస్తుతం కరోనా కారణంగా పరిస్థితులు కొంచెం అసాధారణంగా ఉండగా.. పలు రాష్ట్ర ప్రభుత్వాలు దీపావళికి టపాసులు పేల్చడాన్ని నిషేధించాయి. ఈ క్రమంలోనే భూమి పెడ్నేకర్ కూడా ఈ ఏడాది నార్మల్‌గా కాకుండా కొంచెం కొత్తగా దివాళీ గిఫ్ట్స్ ప్లాన్ చేసింది. పండుగల పవిత్రతపై ఉన్న నమ్మకాన్ని పెంచుతూ తన కుటుంబ సభ్యులతో పాటు బాలీవుడ్ సెలెబ్రిటీలకు మొక్కలను కానుకగా అందిస్తోంది. జూట్, బయోడిగ్రేడబుల్ మెటీరియల్స్‌తో కూడిన ప్యాకేజింగ్‌తో కానుకలు అందించనున్నట్లు చెప్పింది. తద్వారా ప్రపంచంలో కొన్ని ఎక్కువ మొక్కలను యాడ్ చేసిన వాళ్లమవుతామని తెలిపింది. మొక్కలు పెంచడం ద్వారా దివాళీ క్రాకర్స్ పేల్చడం వల్ల ఏర్పడే కాలుష్యం తగ్గిపోతుందని, అందరు కూడా ఇదే పద్ధతి ఫాలో అయితే బాగుంటుందని చెప్పింది.
ప్రకృతికి ప్రమాదకర పరిస్థితి ఏర్పడే చాన్స్ ఉన్నందున క్లైమేట్ వారియర్‌గా పనిచేస్తూ, క్లైమేట్ చేంజ్ అనేది నిజం అనే విషయంపై అవగాహన కల్పించిన భూమి.. నేచర్‌కు రిలీఫ్ ఇచ్చే ఏ ఒక్క చాన్స్ కూడా వదులుకోకుండా వర్క్ చేస్తుండటం విశేషం. కాగా ఏళ్లు గడిచే కొద్ది జంతువులు అంతరించి పోవడం, అడవులు కాలిపోతుండటం, మంచు పర్వతాలు కరిగిపోతుండటం, పర్యావరణ సమతుల్యత దెబ్బతినడాన్ని మనం చూస్తూనే ఉన్నాం.
కాగా భూమి పెడ్నేకర్ సౌత్ స్టార్ అనుష్క శెట్టి ‘భాగమతి’ సినిమాకు రీమేక్‌గా వస్తున్న ‘దుర్గావతి’ సినిమాతో రాబోతుంది. త్వరలోనే ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ కాబోతుంది.