ఏ1 నుంచి ఏ2గా సుబ్బారెడ్డి ఎలా మారారు: మౌనిక రెడ్డి

by srinivas |
ఏ1 నుంచి ఏ2గా సుబ్బారెడ్డి ఎలా మారారు: మౌనిక రెడ్డి
X

దిశ,వెబ్‌డెస్క్: తన సోదరి భూమా అఖిలప్రియ అరెస్ట్ వెనక రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయని మౌనిక రెడ్డి ఆరోపించారు. తన సోదరి విషయంలో పోలీసుల తీరు అమానుషంగా ఉందన్నారు. ఓ మహిళ అని కూడా చూడకుండా పోలీసులు వ్యవహరించిన తీరు బాధాకరమని అన్నారు. గాంధీ ఆస్పత్రిలో తన సోదరి కండ్లు తిరిగి పడిపోతే ఆమెను ఎవరూ పట్టించుకోలేదని వాపోయారు. భూ వివాదంపై చర్చించేందుకు తాము సిద్దంగా ఉన్నామని తెలిపారు.

కాగా ఈ కేసులో ఏ1 నుంచి ఏ2‌గా ఏవీ సుబ్బారెడ్డి ఎలా మారారని ఆమె ప్రశ్నించారు. ఎవర్నీ కిడ్నాప్ చేయాల్సిన అవసరం తమ కుటుంబానికి లేదని వెల్లడించారు. భార్గవ్ రామ్ ఎక్కడ ఉన్నారన్న విషయం తమకు తెలియదనీ చెప్పారు. ఈ కేసులో ఎలాంటి సంబంధం లేకున్నా …తన తమ్ముడిని పోలీసులు ఉద్దేశ్య పూర్వకంగా వేధిస్తున్నారని ఆమె ఆరోపించారు. తాము కర్నూలులో పుట్టామనీ…కానీ పెరిగింది మాత్రం హైదరాబాద్ లోనేనని తెలిపారు.

తమ తండ్రి మరణం తర్వాత హఫీజ్‌పేట్‌ భూ వివాదంపై తాము ప్రవీణ్‌రావుతో చర్చించామని వెల్లడించారు. తమ ఇంటికి వచ్చి వెళ్లేంత సన్నిహిత్యం ప్రవీణ్‌రావుకు ఉందన్నారు. చంచల్‌గూడ జైలులో తన అక్కకు ఫిట్స్ వచ్చినట్టు సూపరింటెండెంట్ ఫోన్ చేశారని తెలిపారు. అరెస్ట్ చేస్తున్న సమయంలో ఓ మాజీ మంత్రి…కనీసం ఓ మహిళ అని కూడా పోలీసులు చూడలేదన్నారు.

భూ వివాదంపై ఎవరైనా పెద్ద మనుషులు కలుగ జేసుకుని పరిష్కరిస్తామంటే దానికి తాము రెడీగా ఉన్నామని ఆమె వెల్లడించారు. హఫీజ్ పేట్ భూమి తమ కంపెనీ పేరుతో ఉందని ఆమె పేర్కొన్నారు. తమ కంపెనీలో ఏవీ సుబ్బారెడ్డి, ప్రవీణ్ రావులు భాగస్వాములని ఆమె వివరించారు.

Advertisement

Next Story

Most Viewed