- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సెంటిమెంట్ దొంగలున్నారు జాగ్రత్త..
దిశ, వెబ్ డెస్క్: దోపిడీ చేసేవారికి కూడ సెంటిమెంట్ ఉంటుదా ? అవునూ సెంటిమెంట్ దొంగలు ఉంటారు ఇదెక్కడా అనుకుంటున్నారా.. మధ్యప్రదేశ్ కట్నీ జిల్లాలో పార్థీ ముఠా పేరు వింటే ప్రజలే కాదు.. పోలీసులు కూడా భయపడాల్సిందే. అయితే వీరికి ఒక సెంటిమెంట్ ఉంది. ఒక సంవత్సరంలో 11నెలలు చోరీకి పాల్పడే ఈ ముఠా ఒక్క నెల మాత్ర దోపిడీలకు దూరంగా ఉంటారు. ఆ ఒక్క నెల ఏం చేస్తారు అనేగా మీ ఆలోచన.. ఏడాదిలో రాఖీ పండగకి 15 రోజులు, హోలీ పండగకి 15 రోజులు ఇంటిలోనే చాలా బుద్ధిమంతులుగా ఉంటారు.
దోపిడీ ఎలా చేస్తారు…
కుటుంబంతో కలసి దాదాపు 60 మంది నగర శివారులో మకాం వేస్తారు. ఉదయాన్నే లేచి రుద్రాక్షలు అమ్మేవారిలా నగరంలోకి వెళ్లి గల్లీగల్లీ తిరుగుతారు. కానీ ఎక్కడా రుద్రక్షల్ని అమ్మరు. వాడ వాడ తిరుగుతూ తాళం వేసి ఉన్న ఇళ్లను గుర్తించి రాత్రి చోరికి వెళ్తారు. చోరీకి వెళ్లి తీసుకొచ్చిన బంగారం, డబ్బులను ఆ ఇంటి మహిళలు, చిన్న పిల్లలు దాచిపెడుతుంటారు. వీరు చోరి చేసే సమయంలో ఒక వేళ ఎవరైన అడ్డు వస్తే ఏమాత్రం కనికరం లేకుండా నరికి చంపుతారు. పోలీసులకు ఏమాత్రం అనుమానం రాకుండా వీరు చోరీలు చేస్తుంటారు.