- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు దరఖాస్తుల ఆహ్వానం
దిశ, న్యూస్బ్యూరో: ఉపాధ్యాయుల దినోత్సవం (సెప్టెంబర్ 5) సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డులకు అర్హత గల వారి నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ప్రధానోపాధ్యాయులు, టీచర్లు, లెక్చరర్ల నుంచి దరఖాస్తులను స్వీకరించి, తుది జాబితాను తమకు అందజేయాల్సిందిగా డీఈఓలను రాష్ట్ర విద్యాశాఖ ఆదేశించింది. 15 ఏండ్ల అనుభవం కలిగి, ఎస్ఎస్సీలో 9+ జీపీఏ సాధించిన పాఠశాలల ప్రధానోపాధ్యాయులను మాత్రమే అర్హులుగా నిర్ణయించారు. ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులకు 2018–19, 2019–20 ఏడాదిల్లో పాఠశాలల ఫార్మార్ఫెన్స్ ఆధారంగా అర్హులను నిర్ణయిస్తారు.
జిల్లా స్థాయిలో కలెక్టర్ ఛైర్మన్గా గల కమిటీ ఉపాధ్యాయులను ఎంపిక చేసి రాష్ట్ర విద్యాశాఖకు జాబితాను పంపిస్తారు. రాష్ట్ర స్థాయిలో స్కూల్ ఎడ్యూకేషన్ సెక్రెటరీ స్థాయి అధికారితో కూడిన ఐదుగురు సభ్యుల కమిటీ అవార్డు గ్రహీతలను ఫైనల్ చేస్తుంది. మూడు విభాగాల్లో రాష్ట్రవ్యాప్తంగా 43 మందికి ఈ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులను అందించనున్నారు. జిల్లా కమిటీలు ఆగస్టు 7లోపు ఎంపిక చేసిన ఉపాధ్యాయుల జాబితాను అందించాల్సి ఉంటుంది. సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఈ అవార్డులను అందజేస్తారు.