‘నిరాధారమైన వార్తలు రాస్తే సహించం’

by Shyam |   ( Updated:2023-08-11 12:43:06.0  )
‘నిరాధారమైన వార్తలు రాస్తే సహించం’
X

దిశ, వెబ్‌డెస్క్: కొన్ని మీడియా సంస్థలు పోలీసులపై తప్పుడు కథనాలు రాస్తున్నాయనీ, ఇకపై అలాంటి నిరాధారమైన వార్తలు రాస్తే సహించబోమని సీపీ అంజనీకుమార్ తెలిపారు. మీడియాలో వచ్చే కథనాలు ప్రజలకు నమ్మకం కలిగించేలా ఉండాలని హితవు పలికారు. బదిలీలు, ప్రమోషన్లు నిబంధనల ప్రకారమే జరుగుతున్నాయని స్పష్టం చేశారు. అలాగే, ఆరేండ్లలో నక్సలిజం, టెర్రరిజం కదలికలు లేవనీ, సిటీలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదని వెల్లడించారు. తాము దేశంలోనే బెస్ట్ పోలీసింగ్‌గా నిలిచామని చెప్పారు.

Advertisement

Next Story