ప్రముఖ బెంగాల్ నటుడు తపస్‌పాల్ మృతి

by Shyam |   ( Updated:2020-02-17 23:54:43.0  )

ప్రముఖ బెంగాల్ నటుడు, తృణముల్ కాంగ్రెస్ మాజీ ఎంపీ తపస్‌‌పాల్(61) గుండెపోటుతో మరణించాడు. ఆయన తన కుమార్తెను చూడడానికి ఇటీవల ముంబైకి వెళ్లారు. మంగళవారం ఉదయం తిరిగి కోల్‌కతా వచ్చే సమయంలో ఎయిర్ పోర్టులో ఛాతిలో నొప్పిరావడంతో సిబ్బంది జుహులోని ఓ ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ తపస్ పాల్ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
కాగా, 1980లో తరుణ్‌ మజుందార్‌ దర్శకత్వంలో వచ్చిన దాదర్‌ కీర్తి సినిమాతో తపస్‌పాల్ బెంగాలీ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. 1984లో మాధురీ దీక్షిత్‌తో కలిసి నటించిన అబోద్‌ చిత్రంతో మంచి గుర్తింపు పొందారు. తపస్‌పాల్ తృణముల్‌ కాంగ్రెస్‌ పార్టీ తరుపున ఎంపీగా గెలిచి ప్రజలకు సేవలందించారు.

Advertisement

Next Story