బెంగాల్‌లో ‘జలస్వప్న’ : సీఎం మమత

by Shamantha N |
బెంగాల్‌లో ‘జలస్వప్న’ : సీఎం మమత
X

దిశ, వెబ్‌డెస్క్: వెస్ట్ బెంగాల్‌లో ప్రతి ఇంటికీ నల్లా ద్వారా తాగు నీరందించేందుకు జలస్వప్న పేరుతో సీఎం మమతా బెనర్జీ కొత్త పథకాన్ని ప్రకటించారు. అయితే, ఈ పథకం కొత్తదేమీ కాదు. తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ఏర్పాటైన తొలినాళ్లలో ‘మిషన్‌ భగీరథ’ పేరు మీద రాష్ట్రంలోని పల్లెల నుంచి పట్టణాలకు మంచి నీరందించేందుకు ప్రారంభించారు.ఈ ప్రాజెక్టుకు దేశవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. తాజాగా ‘మిషన్ భగీరథ’ను స్ఫూర్తిగా తీసుకుని పశ్చిమ బెంగాల్‌ సర్కారు ‘జల్‌ స్వప్న’ అనే భారీ ప్రాజెక్టును చేపడుతోంది. ఐదేళ్లలో ఈ ప్రాజెక్టును పూర్తి చేసి, బెంగాల్‌లోని 2 కోట్ల గ్రామీణ కుటుంబాలకు తాగు నీరందిస్తామని ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ తాజాగా ప్రకటించారు. తెలంగాణలో భగీరథ ప్రాజెక్టు పనులు ప్రారంభించిన కొద్ది రోజులకే దానిని అధ్యయనం చేసేందుకు ముగ్గురు అధికారులతో కూడిన బెంగాల్‌ బృందం 2015 నవంబర్ 4న రాష్ట్రానికి వచ్చింది. అప్పుడు మంత్రి కేటీఆర్‌తో పాటు ప్రాజెక్టు అధికారులతో వారు భేటీ అయ్యారు. మమత తాజా ప్రకటన నేపథ్యంలో.. కేటీఆర్‌ ట్విట్టర్ వేదికగా ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. ఒకప్పుడు బెంగాల్‌ ఆలోచనలను దేశం అనుసరిస్తుందని అనే వారని, ఇప్పుడు సీఎం కేసీఆర్‌ తీసుకొచ్చిన పథకాన్ని బెంగాల్‌లో అమలు చేయడం గర్వకారణమని ఆయన చెప్పుకొచ్చారు.

Advertisement

Next Story

Most Viewed