- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పీజీ మెడికల్ డిగ్రీ, డిప్లొమా పరీక్షలు ప్రారంభం
X
దిశ, వెబ్‌డెస్క్: కాళోజీ హెల్త్ యూనివర్సిటీ పరిధిలో పీజీ మెడికల్ డిగ్రీ, డిప్లొమా పరీక్షలు శనివారం ప్రారంభమయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 13సెంటర్లలో మొత్తం 1,187 మంది అభ్యర్థులు పరీక్ష రాయాల్సి ఉండగా 1,140 మంది అభ్యర్థులు హాజరయ్యారు. 47మంది అభ్యర్థులు గైర్హాజరయ్యారు. కొవిడ్-19 నేపథ్యంలో అన్ని పరీక్షాకేంద్రాల్లో పట్టిష్ఠ ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టి థర్మల్ స్క్రీనింగ్ నిర్వహించిన తర్వాతే విద్యార్థులను పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తున్నారు. పరీక్షా కేంద్రాలను ఎగ్జామ్‌కు ముందు రోజుతో పాటు, పరీక్ష తర్వాత శానిటైజ్ చేస్తున్నారు. గాంధీలో పీజీ చేస్తున్న అభ్యర్థికి ఇటీవల కరోనా సోకి ఐసోలేషన్‌లో ఉండగా, పరీక్ష రాస్తానని వర్సిటీ ఉప కులపతిని కోరగా ఆయన వెంటనే అనుమతిస్తూ గాంధీ వైద్య కాలేజీలో ప్రత్యేక సెంటర్‌ను ఏర్పాటు చేయించారు.
Advertisement
Next Story