- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హ్యాట్సాఫ్.. నలుగురికి ప్రాణభిక్ష పెట్టిన బిచ్చగాడు
దిశ, ఏపీ బ్యూరో: నీటి గుంతలో సరదాగా ఈతకు వెళ్లి మునిగిపోతున్న నలుగురిని ఓ యాచకుడు రక్షించాడు. ఆ నలుగురుకు ప్రాణభిక్ష పెట్టాడు. ఐదుగురు గుంతలో ఈతకొట్టేందుకు ప్రయత్నిస్తుండగా.. ఒకరు మునిగి చనిపోగా మిగిలిన నలుగురును యాచకుడు రక్షించాడు. ఈ ఘటన రాజంపేటలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే చెయ్యేటి గ్రామమైన కుమ్మరపల్లెకు చెందిన ఐదుగురు విద్యార్ధులు సరదగా ఈత కొట్టడానికి రైల్వే వంతెనకు చేరుకున్నారు. ఇసుక కోసం గోతులు తీసిన గుంతల్లో ఇటీవలే భారీ వర్షానికి నీరు వచ్చి చేరింది. ఆ ఐదుగురు విద్యార్థులు ఈ గుంతల్లో ఈత కొట్టేందుకు దిగారు. కాగా ఆ గుంతలు బాగా లోతుగా ఉండటంతో ఐదుగురు లోపలకి కూరుకుపోయారు. ఒడ్డున ఉన్నవారు గట్టిగా అరవడంతో అటుగా వెళ్తున్న యాచకుడు తన ప్రాణాలు సైతం లెక్క చేయకుండా గుంతలోకి దిగి నలుగురును బయటకు తీసుకొచ్చాడు.
ఆదిత్య (16) అనే బాలుడు ఊపిరాడక మృతి చెందాడు. స్థానికుల ఫిర్యాదుతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని వెలికితీయించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇటీవలె తండ్రి మరణించగా.. ఆదిత్య తల్లితో కలిసి ఆదిత్య ఉంటున్నాడు. తనకు మిగిలిన ఒక్కగానొక్క కొడుకు మృతి చెందడంతో తల్లి శైలజ కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. ఒక వైపు భర్త.. మరోవైపు కొడుకు ఇలా మృతిచెందడంతో తనకు దిక్కెవరంటూ ఆమె రోదిస్తున్న తీరు అందర్నీ కంటతడిపెట్టించింది. ఇకపోతే నలుగురిని కాపాడిన యాచకుడిను పోలీసులు, స్థానికులు అభినందించారు.
- Tags
- beggar