- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
పశువుల కాపరిపై ఎలుగు బంటి దాష్టికం.. కనుగుడ్లు పీకేసి మరీ( వీడియో)
దిశ, వేములవాడ : సిరిసిల్ల జిల్లాలో ఎలుగుబంటి దాడి కలకలం సృష్టించింది. రుద్రంగి మండలం దేగావత్ తండాలో ఆవులు మేపడానికి వెళ్లిన వ్యక్తిపై దాడి చేసి గాయపరిచింది. వివరాల్లోకి వెళ్తే.. దేగావత్ తండాకు చెందిన కున్సోతు గంగాధర్ (50) ఆవుల మందను కాస్తూ ఉంటాడు. మంగళవారం తప్పిపోయిన ఆవులను వెతికే క్రమంలో మానాల అడవి ప్రాంతానికి వెళ్ళాడు. ఈ క్రమంలో పొదల్లో నుంచి ఎలుగుబంటి ఒక్కసారిగా వచ్చి గంగాధర్ పై దాడి చేసింది. మీదికి ఎగబడుతూ శరీరాన్ని రక్కేసింది. కనుగుడ్లు పీకేస్తూ ముఖం నిండా గాయాలు చేస్తూ దాడి చేసింది. దాన్ని ప్రతిఘటించలేక బాధితుడి అరుపులతో సమీపంలో ఉన్న రైతులు ఘటనాస్థలికి చేరుకుని అరుపులు, కేకలు వేయడంతో ఎలుగుబంటి అక్కడినుంచి అడవిలోకి పారిపోయింది. ఘటనలో గంగాధర్ తల, కళ్లకు తీవ్రగాయాలయ్యాయి. తీవ్ర రక్తస్రావమై ప్రాణాపాయ స్థితికి చేరుకున్నాడు. తీవ్రగాయాలపాలైన వ్యక్తిని స్థానికులు నీళ్లు తాగించి సిరిసిల్ల ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.