ఐపీఎల్ వాయిదా పడనుందా?

by Shiva |   ( Updated:2021-05-03 04:50:32.0  )
ఐపీఎల్ వాయిదా పడనుందా?
X

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ నిర్వహణపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దేశంలో సెకండ్ వేవ్ విలయ తాండవం సృష్టిస్తుండటం, పలువురు క్రికెటర్లు కరోనా బారిన పడుతున్న నేపథ్యంలో ఐపీఎల్‌ను వాయిదా వేస్తారా? అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే పలువురు క్రికెటర్లు కరోనా బారిన పడి కోలుకోగా.. తాజాగా కోల్‌కత్తా నైట్ రైడర్స్ ఆటగాళ్లు వరుణ్ చక్రవర్తి, సందీప్ వారియర్ కరోనా బారిన పడ్డారు. దీంతో ఇవాళ రాత్రి బెంగళూరు, కోల్‌కత్తా మధ్య జరగాల్సిన మ్యాచ్‌ను బీసీసీఐ వాయిదా వేసింది.

అయితే చెన్నై సూపర్ కింగ్స్‌ బౌలింగ్ కోచ్ లక్ష్మీపతి బాలాజీతో పాటు సీఈవో కాశీ విశ్వనాథన్, బస్ క్లీనర్‌కు ఆర్టీపీసీఆర్ టెస్టుల్లో పాజిటివ్‌గా తేలింది. అయితే యాంటీజెన్ టెస్టుల్లో మాత్రం నెగిటివ్‌గా రిపోర్టు వచ్చింది. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ వర్గాల్లో ఆందోళన మొదలైంది. ఈ తరుణంలో ఐపీఎల్‌ను వాయిదా వేసే అవకాశముందనే వార్తలు వస్తున్నాయి.

Advertisement

Next Story