జనగణనలో బీసీ కుల గణన చేపట్టాలి : శ్రీనివాస్ గౌడ్

by Shyam |
jajula Srinivas
X

దిశ, చౌటుప్పల్: జనగణనలో బీసీ కుల గణన చేపట్టాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో బీసీ కుల గణన చేపట్టాలంటూ డిసెంబర్ 13, 14,15 న బీసీ సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన చలో ఢిల్లీ కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ…

బీసీ కుల గణన చేపట్టే వరకు జాతీయ స్థాయిలో తమ పోరాటాన్ని కొనసాగిస్తామని ఆయన తెలిపారు. అందుకోసం పార్లమెంటును ముట్టడిస్తామని, జాతీయస్థాయిలో అఖిల పక్ష సమావేశాన్ని కూడా ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు వరికుప్పల మధు, చౌటుప్పల్ మండల అధ్యక్షుడు ఆదిమూలం శంకర్, బొంగు జంగయ్య, పానుగంటి విజయ్, బండిగారి రాజు, గీత సంఘం అధ్యక్షుడు ఈదయ్య గౌడ్, శాలివాహన సంఘం నాయకులు కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story