వచ్చేవారం 4రోజులు బ్యాంకులు బంద్

by Shyam |
వచ్చేవారం 4రోజులు బ్యాంకులు బంద్
X

వచ్చే వారంలో నాలుగు రోజులు బ్యాంకులు మూతపడనున్నాయి. 25న ఉగాది పండుగ కావడం, అందులోనే ఉద్యోగుల సమ్మె, నాలుగో శనివారం ఇలా అన్ని ఒకే వారంలో రావడంతో ఆర్థిక లావాదేవీలు నిలిచిపోనున్నాయి. సోమ, మంగళ, గురు వారాల్లో బ్యాంకులు యథావిధిగా తమ కార్యాకలాపాలను కొనసాగించనున్నట్టు సమాచారం. అయితే బుధవారం ఉగాది, శుక్రవారం సమ్మె, నాలుగో శనివారం,ఆదివారం కామన్ హాలిడే ఇలా వరుస సెలవులు రానున్నాయి. అంటే వచ్చేవారం 3రోజులు మాత్రమే బ్యాంకులు నడుస్తాయి.

Tags: banks holidays, next week, 3days only wrk, fest, samme, 4th saturday, sunday

Advertisement

Next Story