సామాజిక దూరం ఇక కలేనా!

by Shyam |   ( Updated:2020-04-13 08:01:18.0  )
సామాజిక దూరం ఇక కలేనా!
X

దిశ, మెదక్: సామాజిక దూరం పాటించాలని ప్రభుత్వం, మీడియా, పోలీసులు ఎన్నిమార్లు చెప్పినా ప్రజలు వినిపించుకోవడం లేదు. ఓ వైపు రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతూ పోతోంది. ఇందుకు కారణం సామాజిక దూరం పాటించకపోవడం, లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించడమేనని తెలుస్తోంది. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌ పరిధిలో గల బ్యాంకుల్లో సోమవారం పలువురు ఖాతాదారులు సామాజిక దూరం విస్మరించారు. కరోనా నివారణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా లాక్‌డౌన్ అమలు చేస్తున్నారు. ఈ క్రమంలో అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు రావాలని, వచ్చిన వారు తప్పకుండా మూడు మీటర్ల సామాజిక దూరం పాటించాలని నిబంధన పెట్టారు. వాటిని వివిధ బ్యాంకుల యాజమాన్యాలు బేఖాతర్ చేశాయి. దీంతో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఖాతాదారులు ఇష్టం వచ్చినట్టు బ్యాంకు ఎదుట నిలబడ్డారు. ఇప్పటికైనా ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణ, సామాజిక దూరం పాటించాలని పలువురు కోరుతున్నారు.

tags: corona, lockdown, social distance break, bank customers

Advertisement

Next Story

Most Viewed