- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
బంగ్లాదేశ్ 'ఆర్థిక' ఉద్దీపనకు 72వేల కోట్ల టాకాల ప్యాకేజీ
ఢాకా: కరోనా వైరస్ దెబ్బతో ఆర్థిక వ్యవస్థ కుదేలవకుండా… బంగ్లాదేశ్ సర్కారు ముందు జాగ్రత్తలకు ఉపక్రమించింది. ఆదివారం ఆ దేశ ప్రధాని షేక్ హసీనా ఉద్దీపన ప్యాకేజీలను ప్రకటించారు. 72, 750(8,573 మిలియన్ డాలర్లు) కోట్ల టాకాల ప్యాకేజీని విడుదల చేయనున్నట్టు ఆ దేశ ప్రధాని తెలిపారు. బంగ్లాదేశ్ పౌరులను ఉద్దేశించి ప్రధాని షేక్ హసీనా ఆదివారం ప్రసంగించారు. క్రితం ప్రకటనలో ఉద్యోగుల జీతాలకు.. ఎగుమతి రంగానికి చెందిన వర్కర్లు ఉద్యోగుల అలవెన్సుల కోసం 5 వేలకోట్ల టాకాలు ప్రకటించారు. ఇప్పుడు 67, 750 టాకాల మొత్తాన్ని నాలుగు ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీల రూపంలో విడుదల చేయనున్నట్టు వెల్లడించారు. మొత్తంగా 72,750 కోట్ల టాకాలను విడుదల చేయనున్నట్టు వివరించారు. ఈ ప్యాకేజీలను విడుదల చేశాక దేశ ఆర్థిక వ్యవస్థ తిరిగి పుంజుకుంటుందని, నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధిస్తుందని భావిస్తున్నట్టు తెలిపారు. ఈ దేశంలో ఇప్పటివరకు 70 కరోనా పాజిటివ్ కేసులు దాటాయి.
Tags: Coronavirus, bangladesh, financial assistance, package, pm sheikh hasina