వీపు మీద కొట్టండి.. కడుపు మీద కాదు : బండ్ల గణేష్

by Shyam |   ( Updated:2020-10-11 08:34:16.0  )
వీపు మీద కొట్టండి.. కడుపు మీద కాదు : బండ్ల గణేష్
X

దిశ, వెబ్‌డెస్క్: తన వ్యాఖ్యలతో, మాటలతో అడ్డంగా బుక్ అయిపోయే నటుడు, నిర్మాత బండ్ల గణేష్.. ఇటీవలి కాలంలో కాస్త ఆచితూచి వ్యవహరిస్తున్నాడు. పవన్‌తో గబ్బర్ సింగ్ సినిమా తీసి, బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకున్న బండ్ల.. పవన్‌కు వీరాభిమాని అన్న సంగతి తెలిసిందే. తనతో మరో సినిమా చేయడం తన కోరికని చెప్పిన బండ్ల.. ఇటీవలే తన గాడ్ పవర్ స్టార్‌తో సినిమా తీస్తున్నట్లుగా ప్రకటించాడు. అయితే.. తనకు బెస్ట్ ఆఫ్ లక్‌తో పాటు విమర్శలు కూడా వస్తున్నట్లు ఉన్నాయి. దాంతో బండ్ల తాజాగా ఓ ఆసక్తికరమైన ట్వీట్ చేశాడు. ‘వీపు మీద కొట్టండి. కానీ దయచేసి కడుపు మీద కొట్టకండి.. ఇది నా విన్నపం. నా మీద దయచేసి ఏ విధమైన వార్తలు రాయొద్దు, నేను చెప్పేవరకు ఇది నా అభ్యర్థన’ అంటూ బండ్ల గణేష్‌ ట్వీట్‌ చేశాడు. అయితే ఈ ట్వీట్‌ చేయడానికి కారణం మాత్రం తెలియరాలేదు. మరి అసలేం జరిగిందో, ఎందుకు అలా ట్వీట్ చేయాల్సి వచ్చిందో.. స్వయంగా బండ్ల గణేష్ తన మనసులో మాట బయటకు వెల్లడిస్తే కానీ అసలు విషయం తెలియదు. మరి అప్పటి వరకు వెయిట్ చేయాల్సిందే.

Advertisement

Next Story