బండి సంజయ్ నిరుద్యోగ దీక్ష ప్రారంభం.. భారీగా తరలి వచ్చిన నిరుద్యోగులు

by Anukaran |   ( Updated:2021-12-27 01:00:05.0  )
బండి సంజయ్ నిరుద్యోగ దీక్ష ప్రారంభం.. భారీగా తరలి వచ్చిన నిరుద్యోగులు
X

దిశ, వెబ్‌డెస్క్ : హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాయలంలో బండి సంజయ్ నిరుద్యోగ దీక్ష ప్రారంభమైంది. దీక్ష సందర్భంగా మహాత్మా గాంధీ చిత్రపటానికి బండి సంజయ్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్ నివాళులు అర్పించారు. అనంతరం దీక్షకు కూర్చున్నారు. బండి సంజయ్ దీక్ష నేపథ్యంలో బీజేపీ కార్యాలయం వద్ద పోలీసులు భారీ బందోబస్త్ ఏర్పాటు చేశారు.

దీక్షకు భారీ సంఖ్యలో నిరుద్యోగులు తరలి వచ్చారు. నిరుద్యోగ దీక్ష చేస్తోన్న బండి సంజయ్‌కు మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశరావు సంఘీభావం తెలిపారు. బీజేపీ ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రఘునందన్ రావు, పార్టీ నేతలు విజయశాంతి, స్వామి గౌడ్, పొంగులేటి, ఇతర నేతలు దీక్షలో పాల్గొన్నారు. సాయంత్రం 4 గంటల వరకు నిరుద్యోగ దీక్ష జరుగనుంది.

Advertisement

Next Story