- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘బండి సంజయ్ బహిరంగ క్షమాపణ చెప్పాలి’
దిశ, అంబర్‌పేట్: మమత బెనర్జీపై బీజేపీ నాయకులు చేస్తున్న ఆరోపణలు మానుకోవాలని లేనిపక్షంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వి.హనుమంతరావు హితవు పలికారు. మూడు సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మమత బెనర్జీ పై బండి సంజయ్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం సరైంది కాదన్నారు. బీజేపీ పార్టీ మహిళలను కూడా కించపరిచే విధంగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బండి సంజయ్ తన భాష తీరు మార్చుకోవాలని సూచించారు. మమతా బెనర్జీకి బండి సంజయ్ బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్నాయని అవసరమైతే లాక్ డౌన్ విధించాలని, రోజు లక్ష టెస్టులు చేయాలని హైకోర్టు ఆదేశించినప్పటికీ ప్రభుత్వం మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదని ఆరోపించారు.
రాష్ట్ర చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ కరోనా కంట్రోల్లోనే ఉందని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కరోనాతో వందల మంది చనిపోతుంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు.సోమేష్ కుమార్ ప్రజలకు వాస్తవాలు తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కేవలం గొప్పలు చెప్పుకోవడం కోసమే సోమేశ్ కుమార్ మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. లాక్ డౌన్ పెట్టే సమయంలో పేదవారి బ్యాంకు ఖాతాలో రూ. 10 వేలు ఆటో, క్యాబ్ డ్రైవర్లకు ఐదు వేల చొప్పున ఇవ్వాలని డిమాండ్ చేశారు. డబ్బులు పోతే ప్రింట్ చేసుకోవచ్చు కానీ ప్రాణాలు పోతే తీసుకురాలేమని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు సరైన వైద్యం అందించాలని కోరారు.