- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చేతబడి చేయించాడన్న నెపంతో హత్య..?
దిశ, వెబ్ డెస్క్: జగిత్యాల జిల్లా మాల్యాల మండలం బల్వంతపూర్ గ్రామంలో సాఫ్ట్ వేర్ ఉద్యోగి దారుణహత్య సంచలనం రేపుతోంది. స్థానిక మంజునాథ ఆలయంలో అతనిని బంధించి సజీవ దహనం చేయడం చర్చనీయాంశంగా మారింది. చేతబడి నెపంతోనే హత్య చేసినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వివరాల్లోకి వెళితే… హైదరాబాద్ అల్వాల్ కు చెందిన పవన్ (35) బెంగుళూర్ లో సాఫ్ట్ వేర్ జాబ్ చేస్తున్నాడు. కాగా 12 రోజుల క్రితం పవన్ చిన్న బావమరిది జగన్ గుండెపోటుతో మృతి చెందాడు. ఈ క్రమంలో జగన్ కుటుంబసభ్యులను పరామర్శించడానికి సోమవారం పవన్ బల్వంతా పూర్ గ్రామానికి వచ్చాడు.
అయితే అదే రోజు రాత్రి సజీవ దహననికి గురయ్యాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. కుటుంబ కలహాలే హత్యకు కారణమని ప్రాథమికంగా అంచనా వేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. సమీప బంధువే ఈ హత్య చేసినట్లు భావిస్తున్నారు. పవన్ చేతబడి చేయించడం వలనే జగన్ చనిపోయాడని అనుమానించిన కుటుంబసభ్యులు అతనిని హతమార్చినట్లు స్థానికులు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కాగా హత్యకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. సోమవారం రాత్రి జగిత్యాల డిఎస్పీ వెంకట రమణ, మాల్యాల సిఐ కిషోర్, ఎస్ ఐ నాగరాజు ఘటనాస్థలాన్ని పరిశీలించగా.. మంగళవారం ఎస్పీ సింధు శర్మ పరిశీలించారు. కేసును త్వరలోనే ఛేదిస్తామని వెల్లడించారు.