గాంధీ వ్యవహారంపై ఈటల ఫైర్..

by Shyam |
గాంధీ వ్యవహారంపై ఈటల ఫైర్..
X

గాంధీ ఆస్పత్రిలో జరుగుతున్న కాంట్రవర్సీపై వైద్యఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజానిజాలు తేల్చేందుకు నేడు గాంధీలోని వైద్య ఉన్నతాధికారులతో ఆయన సమావేశం కానున్నారు. డాక్టర్ వసంత్‌ కుమార్ చేసిన ఆరోపణలు వాస్తవం అని తేలితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.అయితే గత కొన్నిరోజులుగా గాంధీ వైద్యులు ఒకరిపైఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు.వసంత కుమార్ కరోనా బాధితుల సమాచారం లీక్ చేశాడని, అందుకే అతన్నిసస్పెండ్ చేశామని సూపరిటెండెంట్ తెలిపారు. కాగా,గాంధీలోని మూడు ముఖ్య విభాగాల్లో పెద్ద ఎత్తున్న స్కాం జరిగిందని దానిని ప్రశ్నించింనందుకే తనను విధుల నుంచి తొలగించారని డాక్టర్ వసంత్ ఆరోపించారు.ఇదంతా ఒకత్తైతే తప్పు చేసిన వారిని వదిలే ప్రసక్తి లేదని మంత్రి హెచ్చరించారు. ఇక స్కాం విషయంపై విచారణ చేయిస్తామని మంత్రి తెలిపారు.

Advertisement

Next Story