ముళ్ళ పొదల్లో శిశువు మృతదేహం.. అనుమానంతో అధికారులు..

by Sumithra |
children
X

దిశ, ముదిగొండ: మండల పరిధిలోని పెద్దమండవ గ్రామంలో గత శుక్రవారం బీసీ కాలనీలో ముళ్ళ పొదల్లో శిశువు మృతదేహం కలకలం రేపింది. ఇది గమనించిన స్థానికులు పంచాయతీ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. దీంతో వారు శిశువు మృతదేహాన్ని మున్నేటి పక్కన ఖననం చేసారు. ఈ సమాచారం తెలుసుకున్న అధికారులు శిశువు మరణానికి గల కారణాలు అనుమానాస్పదంగా ఉండడంతో ఆదివారం కేసు నమోదు చేశారు. శిశువు మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిర్వహించారు. డిఎన్ఏ టెస్ట్ నిమిత్తం ల్యాబ్ కి పంపించారు. శిశువు మరణానికి గల కారణాలు సేకరించి పంచనామా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముదిగొండ తహశీల్దార్ టి. శ్రీనివాస్ రావు, ఎస్సై తోట నాగరాజు, పెద్దమండవ సెక్రెటరీ వెంకటేశ్వరరావు, ఉప సర్పంచి కోడే నరసింహారావు, ఎంపీటీసీ కుక్కల వెంగళరావు, కానిస్టేబుళ్లు ప్రసాదు, నరసింహారావు తదితర అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Next Story